హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ విశ్వాస ఘాత‌కుడు అని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న తిన్నింటి వాసాల‌ను లెక్క‌బెట్టార‌ని మండిప‌డ్డారు. 2004కు ముందు ఈటెల అడ్ర‌స్ ఎక్క‌డ‌..? ఈటెల‌ను మంత్రి చేసింది కేసీఆర్ క‌దా? అని సుమ‌న్ ప్ర‌శ్నించారు. ఎమ్మెల్యేలు గువ్వ‌ల బాలరాజు, కేపీ వివేకానంద‌తో క‌లిసి బాల్క సుమ‌న్ టీఆర్ఎస్ ఎల్పీలో ఈ రోజు మీడియాతో మాట్లాడారు.

ఈటెల రాజేందర్ మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారని,  ఈటెల శిఖండి రాజకీయాలు చేస్తున్నాడని సుమన్ విమర్శించారు. ఆరోగ్య మంత్రిగా ఆర్థిక మంత్రిగా ఈటెల అవినీతికి పాల్పడ్డాడని, కమ్యూనిస్టు కమ్యునలిస్టుగా మారారని ఎద్దేవా చేశారు. హుజూరా బాద్ లో ఈటెల ఓటమి ఖాయమైందని, అందుకే గజ్వెల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆరోపించారు.

ఈటెల కేసీఆర్ పై పోటీ చేసే సిపాయ..ఈటెల ఓ చెల్లని రూపాయి అని సుమన్ మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఈటెల తంటాలని, …బీజేపీ లో ఈటెల ది బానిస బతుకన్నారు. వరదల్లోనూ బీజేపీ కండువాలు కప్పుతూ బురద రాజకీయం చేస్తోందని, ఈటెల వంటి శిఖండి లు తెలంగాణ కంట్లో నలుసు లా మారారన్నారు. కాంగ్రెస్ బీజేపీ లు తెలంగాణ ద్రోహుల తయారీ కర్మాగారాలుగా మారాయన్నారు.  పదవులు రాజకీయాలు తప్ప బీజేపీ కాంగ్రెస్ లకు ఈ వరదల్లో ప్రజల ఘోష పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల లాంటి వారు పేకాట లో జోకర్లుగా మారారని, బీసీ, ఎస్సిల భూములు కబ్జా చేసిన నీచ చరిత్ర ఈటెల దన్నారు. ఈటెల చిట్టాను బయటకు తెస్తామని, కబ్జా చేసిన భూములను పేదలకు పంచుతామని సుమన్ స్పష్టం చేశారు. బీజేపీ అవినీతిపరులు, క్రిమినల్స్ కు అడ్డా గా మారిందని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *