State Sponsored: సికింద్రాబాద్ ఘటన టిఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో జరిగిన హింస అని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని బిజేపు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ స్టేషన్ లో నేడు జరిగిన హింసాత్మక ఆందోళనలపై బండి స్పందించారు. ఇది టిఆర్ ఎస్ ప్రభుత్వం,ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి చేసిన కుట్రగా ఆరోపించారు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అచేతనావస్థలో, చేవ లేకుండా ఉన్నాడని, ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని మండిపడ్డారు. జూలై మొదటివారంలో హైదరాబాద్ లో జరగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల నుంచి దృష్టి మళ్ళించడానికే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని, అక్కడకు వెళ్ళవద్దని ఆదేశించి, కేంద్రాన్ని బద్నాం చేసేందుకే ఇదంతా చేశారని మండిపడ్డారు.
ప్రజల మాన, ధన, ప్రాణాలను కాపాడాలని, ఈ మొత్తం సంఘటనలపై కేంద్రం వెంటనే విచారణకు ఆదేశించాలని బండి సంజయ్ కోరారు.
Also Read : సికింద్రాబాద్ లో చేయి దాటిన పరిస్థితి