Wednesday, October 4, 2023
HomeTrending NewsRahul vs Modi: రైతుల పాలిట శని కేసీఆర్ - బండి సంజయ్

Rahul vs Modi: రైతుల పాలిట శని కేసీఆర్ – బండి సంజయ్

మోదీ ఇంటిపేరున్న వాళ్లంతా దొంగలేనంటూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీని అవమానించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు.  ఓబీసీ ‌సమాజాన్ని అవమానించారు. తక్షణమే రాహుల్ గాంధీ చేసిన తప్పును ఒప్పుకుని ఓబీసీ సమాజానికి, నరేంద్రమోదీకి క్షమాపణ చెప్పాలన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…..

ఓబీసీలను అవమానించడం, కోర్టులను అవమానించడం, చట్టాన్ని ఉల్లంఘించడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. గతంలో ఇందిరాగాంధీ నుండి నేటి రాహుల్ గాంధీ వరకు న్యాయ వ్యవస్థను అగౌరవపరుస్తూనే ఉన్నారు. కోర్టు తీర్పునిస్తే దానిని శిరసావహించకుండా జడ్జీలను కించపర్చడం ముమ్మాటికీ న్యాయ వ్యవస్థను అవమానించడమే. ప్రధాని నరేంద్ర మోదీని బదనాం చేయడం ద్వారా ఓబీసీలను కించపరుస్తున్నారు. దేశంలోని ఓబీసీలంతా జాగ్రుతం కావాలి. రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారో… ఆయనకే తెలియడం లేదు… గతంలో చౌకీదార్ చోర్ అంటూ వ్యాఖ్యలు చేస్తే సుప్రీంకోర్టు మెట్టికాయలు పెట్టింది. అయినా మారలేదు.

8 ఏళ్లుగా రైతులకు నయా పైసా సాయం చేయని కేసీఆర్ కేంద్రం పైసా ఇవ్వడం లేదని బద్నాం చేయడం సిగ్గు చేటు. 2016‌-17లో కేంద్రం రాష్ట్ర రైతులకు సాయం చేయాలని 916 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అందులో 700 కోట్లు కూడా ఖర్చు చేయకుండా గండీ కొట్టి రైతులను మోసం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. మళ్లీ కేంద్రాన్ని సాయం అడిగితే పాత లెక్కలు అడుగుతదనే భయంతో కేసీఆర్ కేంద్రానికి నివేదికలు పంపడం లేదు. రైతుల పాలిట శని కేసీఆర్… గతంలో ఇచ్చిన ఫ్రీ యూరియా, రుణమఫీ హామీలను అమలు చేయలేదు. అకాల వానలతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే సాయం చేస్తోందనడం పచ్చి అబద్దం… నిన్న జారీ చేసిన జీవోలో ఎస్డీఆర్ఎఫ్ నిధులతోనే రైతులకు సాయం చేస్తున్నట్లు చెప్పారు. మరి ఆ నిధుల్లో 75 శాతం వాటా కేంద్రానిదే కదా… ఆ మాట ఎందుకు చెప్పడం లేదు? రైతులకు కేసీఆర్ మంచి చేస్తే వడ్ల కుప్పలపై రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? సమాధానం చెప్పాలే. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్, ఆయన కొడుకు కేంద్రంపై బదనాం మోపి తిట్టడం అలవాటైపోయింది.

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Ramaraju on జనం భాష
Ramaraju on జనం భాష
Radhakrishna Regalla on లోహం- వ్యామోహం
ఆకతాఈ శ్రీ on తెలుగు వెలుగు
Indrasen Bejjarapu on మనసున్న పులి
ఎమ్వీ రామిరెడ్డి on మనసున్న పులి
ఫణీన్ద్ర పురాణపణ్డ on హంపీ వైభవం-1
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Dr MVJM RAMA PRASAD MANDA on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-1
తనికెళ్ల శ్రీనివాస్ on రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !
కర్రా వెంకటరత్నం on మా నాన్న