Saturday, November 23, 2024
HomeTrending News18న హాజరవుతా... మహిళా కమిషన్ కు బండి సంజయ్ లేఖ

18న హాజరవుతా… మహిళా కమిషన్ కు బండి సంజయ్ లేఖ

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ లో విచారణకు ఈ నెల 18వ తేదీన హాజరు కానున్నట్టుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున బండి సంజయ్ కు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ నోటీసులకు బండి సంజయ్ ఇవాళ సమాధానం పంపారు. పార్లమెంట్ సమావేశాలున్నందున ఈ నెల 15న విచారణకు రాలేనని ఆ లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ నెల 18న ఆదివారం హాజరు అయ్యేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన అంశంపై బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ పై పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. బండి వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది మహిళా కమిషన్. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డీజీపీ అంజనీ కుమార్ ను రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు డీజీపీ – రాష్ట్ర మహిళా కమిషన్ కు నివేదికను సమర్పించారు. నివేదిక ఆధారంగా బండి సంజయ్ కు నిన్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్