Sunday, January 19, 2025
HomeTrending Newsబంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా..సైనిక పాలన

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా..సైనిక పాలన

బంగ్లాదేశ్ రాజకీయ అనిశ్చితి నెలకొంది. ప్రధాని షేక్ హసీనా ఈ రోజు (సోమవారం) రాజీనామా చేశారు. ప్రధాని దేశం విడిచిపెట్టినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొన్నది. సోదరి రెహానాతో కలిసి హసీనా సైనిక హెలికాప్టర్‌లో భారత్ లోని పశ్చిమ బెంగాల్‌కు వెళ్ళారని ఆ దేశ మీడియాలో కథనాలు వస్తున్నాయి. షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆమె ఇప్పటికే రాజధాని నుంచి పారిపోయిందని వార్తలు వస్తున్నాయి.

మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి దేశాన్ని ఆర్మీ నడిపిస్తుందని ఆర్మీ చీఫ్ చెప్పారు. భారీ నిరసనల నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేసి రాజధాని నుండి పారిపోయారని మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ తెలిపారు.

1971 యుద్ధంలో మ‌ర‌ణించిన సైనిక కుటుంబాల పిల్ల‌ల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు 30 శాతం కోటాను కేటాయిస్తూ షేక్ హ‌సీనా స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ నిరసనలు వెల్లువెత్తాయి. హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణ పడ్డారు. జులై 19న కోటా విధానాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేయడంతో ఆదివారం జరిగిన హింసాకాండలో కనీసం 98 మంది మరణించారు, 67 మంది మరణించారు.

దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న తీవ్ర ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో.. ఇవాళ బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి.. దేశం విడిచి వెళ్లారు. ఆమె ఎక్క‌డికి వెళ్లార‌న్న దానిపై స్పష్టత లేదు. ప‌శ్చిమ బెంగాల్ వెళ్లిన‌ట్లు ఢాకా ట్రిబ్యూన్ పేర్కొన్న‌ది. ఆమె అగ‌ర్త‌లా వెళ్తున్న‌ట్లు బంగ్లాదేశ్ బీబీసీ చెప్పింది.

భారత మిత్రుడు..బంగబంధుగా పేరున్న దివంగత నేత ముజిబుర్ రెహమాన్ కుమార్తె షేక్ హసీనా ఇప్పటివరకు మనదేశంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. షేక్ హసీనా రాజీనామాతో చాందసవాదులు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. బేగం ఖలీదా జియా ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తే భారత్ తో సంబంధాలు అంతంతమాత్రమే. చైనా అనుకూలంగా వ్యవహరించే ఖలీదా మనతో సఖ్యతకు సహకరించదు. తద్వారా తూర్పు, ఈశాన్య సరిహద్దుల్లో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్