Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్Ind (W) - Ban (W): చివరి టి 20లో బంగ్లా విజయం

Ind (W) – Ban (W): చివరి టి 20లో బంగ్లా విజయం

ఇండియా- బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరుగుతోన్న చివరి టి 20 లో బంగ్లా మహిళలు 4 వికెట్ల తేడాతో విజయం సాధించారు. టాస్ గెలిచి బ్యాటింగ్  చేసిన ఇండియా 102 పరుగులే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఆతిథ్య బంగ్లా జట్టు 18.2  ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి సాధించింది.

ఇండియా 20 పరుగులకే ఓపెనర్ల వికెట్లు (స్మృతి మందానా-1; షఫాలీ వర్మ-11) వికెట్లు కోల్పోయింది. జెమైమా రోడ్రిగ్యూస్- హర్మన్ ప్రీత్ లు నాలుగో వికెట్ కు 45 పరుగులు జోడించారు. జెమైమా-28; హర్మన్-40 స్కోరు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత యస్తికా భాటియా (11) ఒక్కటే మెరుగ్గా ఆడింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 102 రన్స్ చేసింది.  బంగ్లా బౌలర్లలో రాబెయా ఖాన్ 3 ; సుల్తానా ఖాతూన్ 2; నహీదా అక్తర్, ఫాహీమా ఖాతూన్, షోర్నా అక్తర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

బంగ్లాదేశ్ సైతం 16 పరుగులకు రెండు వికెట్లు (సత్తి రాణి-10 దిలారా అక్తర్-1) కోల్పోయి కష్టాల్లో పడింది. షర్మినా సుల్తానా-42; నైగర్ సుల్తానా-14; సుల్తానా ఖాతూన్-12; నహీడా అక్తర్-10 పరుగులతో రాణించారు.

షమీనా సుల్తానా  కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్; హర్మన్ ప్రీత్ కౌర్ కు ప్లేయర్ అఫ్ ద సిరీస్ లభించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్