Its Barty: ఆస్ట్రేలియా క్రీడాకారిణి, టాప్ సీడ్ అప్లే బార్టీ తన కల సాకారం చేసుకుంది. సొంతగడ్డపై స్వదేశీ టైటిల్ గెల్చుకుని సత్తా చాటింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా క్రీడాకారిణి, 27వ సీడ్ డానియేలి కొలిన్స్ పై 6-3;7-6 తేడాతో విజయం సాధించి తన కెరీర్ లో మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకుంది. 2019 ఫ్రెంచ్ ఓపెన్, 2021 వింబుల్డన్ గెల్చుకున్న బార్టీ ఈ ఏడు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా అవతరించింది.
తొలి సెట్ ను అవలీలగా గెల్చుకున్న బార్టీకి రెండో రౌండ్ లో కోలిన్స్ గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశలో 1-5 తో వెనుకబడిన బార్టీ ఆ తర్వాత పుంజుకొని ఆడింది. హోరాహోరీగా సాటిన ఈ సెట్ లో చివరకు బార్టీ పైచేయి సాధించి టైటిల్ గెల్చుకుంది. కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ అందుకోవాలన్న కోలిన్స్ కల ఫలించలేదు.
1978లో క్రిస్ ఓనీల్ తరువాత ఇంతవరకూ ఆస్ట్రేలియా కు చెందిన క్రీడాకారిణి ఎవ్వరూ ఈ టైటిల్ గెలవలేకపోయారు. 44 ఏళ్ళ తరువాత ఈ ఏడాది బార్టీ ఈ టైటిల్ సాధించి మరో రికార్డు సొంతం చేసుకుంది.
Also Read : ఫైనల్లో నాదల్ తో మెద్వదేవ్ ఢీ