పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అక్కడ ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే బైరాన్ బిశ్వాస్ హ్యాండిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘జోనో సంజోగ్ యాత్ర’లో టీఎంసీ కీలక నేత అభిషేక్ బెనర్జీ సమక్షంలో బైరాన్ బిశ్వాస్ అధికార పార్టీ కండువా కప్పుకున్నారు.
TMC: బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్
కాగా, బైరాన్ బిశ్వాస్ కొన్ని నెలల క్రితమే సాగర్దిఘీ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. ఇప్పుడు అధికార టీఎంసీలో చేరిపోయారు. ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. విభజన, కుట్ర రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఢీకొట్టడానికి బైరాన్ బిశ్వాస్ సరైన వేదికను ఎంచుకున్నారని వ్యాఖ్యానించారు.