Monday, March 31, 2025
HomeTrending Newsకేరళలో తగ్గని కేసులు

కేరళలో తగ్గని కేసులు

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత కొన్ని రోజులుగా 40వేల పైనే ఉంటోన్న కేసులు.. తాజాగా ఆ మార్క్‌ దిగువకు పడిపోయాయి. అటు మరణాల్లోనూ భారీ తగ్గుదల కన్పించడం కాస్త ఊరటనిస్తోంది. 24 గంటల వ్యవధిలో 38,948 కొత్త కేసులు బయటపడగా.. 219 మంది మృత్యువాతపడ్డారు. క్రితం రోజు(42వేలు)తో పోలిస్తే 8.9శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి.

తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.30కోట్లు దాటింది. ఇక ఇప్పటివరకు 4,40,752 మందిని వైరస్‌ బలితీసుకుంది. ఇదిలా ఉండగా.. చాలా రోజుల తర్వాత కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. గడిచిన 24 గంటల్లో 43,903 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 97.44శాతంగా ఉంది. ప్రస్తుతం 4,04,874 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల కేసుల రేటు 1.23శాతానికి చేరింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం 25.23లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 68.75కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి.

కేరళలో కొనసాగుతున్న ఉద్ధృతి.

మరోవైపు కరోనా ఉద్ధృతి నుంచి దక్షిణాది రాష్ట్రం కేరళ ఇంకా బయటపడట్లేదు. దేశవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి కాస్త కట్డడిలోనే ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఆదివారం ఈ రాష్ట్రంలో 26,701 కేసులు బయటపడగా.. 74 మంది కరోనాతో మరణించినట్లు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీనికి తోడు కేరళలో మళ్లీ నిపా వైరస్‌ కూడా కలకలం రేపుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్