Thursday, April 25, 2024
HomeTrending Newsతుంచుకుంటూ పోతున్నారు: లోకేష్

తుంచుకుంటూ పోతున్నారు: లోకేష్

రెండు నెలల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల పెన్షన్లు తొలగించిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. పెన్షన్లు పెంచుకుంటూ పోతానన్న జగన్ తుంచుకుంటూ పోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు అయన సామాజిక మాధ్యమాల్లో వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా జత చేశారు.

“పెన్షన్లు పెంచుకుంటూ పోతానన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  తుంచుకుంటూ పోతున్నారు. రూ. 3వేల పెన్షన్ ఇస్తానని ఆశపెట్టి మాట మార్చారు, మడమ తిప్పారు.  అరవైఐదు లక్షలమందికి పెన్షన్ ఇస్తానని డాబు కబుర్లు చెప్పి అడ్డమైన కారణాలు చెబుతూ భారీగా పెన్షన్లు కోతపెడుతున్నారు. గత రెండు నెలల్లోనే 2.30 లక్షల పెన్షన్లు లేపేసి అవ్వా తాతలకు తీరని అన్యాయం చేశారు. మీరు పెడుతున్న మానసిక క్షోభ భరించలేక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనే ఆధారంగా బతుకుతున్న13మంది వృద్ధులు మృతి చెందారు.

మీరిచ్చిన హామీ ప్రకారం చూసుకున్నా ఇప్పుడు రూ. 2,750 పెన్షన్ ఇవ్వాలి. ప్రతి అవ్వా తాత దగ్గరా నెలకు రూ. 500 కొట్టేస్తున్నదే కాక భారీగా పెన్షన్లు కోసేస్తున్న పాపం వూరికేపోదు జగన్ రెడ్డి గారు. ఆరోగ్య సమస్యలు, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే వారి పెన్షన్లు తీసేయడం సబబు కాదు. ఎత్తేసిన పెన్షన్లు అన్ని వెంటనే ఇవ్వాలి” అంటూ ట్వీట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్