Tuesday, March 17, 2026
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ:  గుజరాత్, బెంగాల్ విజయం

ప్రొ కబడ్డీ:  గుజరాత్, బెంగాల్ విజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ ల్లో తమిళ్ తలైవాస్ పై గుజరాత్; బెంగుళూరుపై బెంగాల్ విజయం సాధించాయి.

గుజరాత్ జెయింట్స్- తమిల్ తలైవాస్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 35-37 తో గుజరాత్ విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 17-14 తో గుజరాత్ ఆధిక్యం సాధించింది. కానీ రెండో అర్ధభాగంలో తలైవాస్ పుంజుకుని ఆడి 21-20 తో పైచేయి సాధించినా ఓటమి తప్పలేదు. రెండు పరుగుల స్వల్ప తేడాతో గుజరాత్ విజయం దక్కించుకుంది.

బెంగుళూరు బుల్స్ – బెంగాల్ వారియర్స్ జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన రెండో మ్యాచ్ లో 40-39తో బెంగాల్ విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో బెంగాల్ 14-13తో స్వల్ప ఆధిక్యం సంపాదించింది. రెండోభాగంలో బెంగుళూరు గట్టి పోటీ ఇచ్చింది. మ్యాచ్ చివరి ఐదు నిమిషాల వరకూ బెంగాల్ సునాయాస విజయం అనుకున్నారు కానీ చివరి ఐదు నిమిషాల్లో బెంగుళూరు విజయం అంచులదాకా వెళ్ళింది. చివరకు 26-26తో సెకండ్ హాఫ్ లో స్కోరు సమం అయ్యింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఒక పాయింట్ తేడాతో బెంగాల్ విజయం సొంతం చేసుకుంది. ఎప్పటిలాగే బెంగుళూరు కెప్టెన్ పవన్ షెరావత్ 13 పాయింట్లతో సత్తా చాటాడు.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత దబాంగ్ ఢిల్లీ (42 పాయింట్లు); బెంగుళూరు బుల్స్ (40); పాట్నా పైరేట్స్ (40); బెంగాల్ వారియర్స్ (35); యూపీ యోధ (33); జైపూర్ పింక్ పాంథర్స్(32) జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular