Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: చెన్నైపై బెంగుళూరు గెలుపు

ఐపీఎల్: చెన్నైపై బెంగుళూరు గెలుపు

RCB won: బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ మరోసారి సమిష్టిగా రాణించి విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ తో నేడు జరిగిన మ్యాచ్ లో 13 పరుగులతో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. లార్మోర్, డూప్లెసిస్, కోహ్లీ బ్యాటింగ్ లో రాణించగా…. హర్షల్ పటేల్, మాక్స్ వెల్ బౌలింగ్ లో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఏ) స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో  చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు కోహ్లీ-డూప్లెసిస్ 62 పరుగులు చేశారు, ­22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 38 పరుగులు చేసిన డూప్లెసిస్ మొయిన్ అలీ బౌలింగ్ లో ఔటయ్యాడు.  గ్లెన్ మాక్స్ వెల్ మరోసారి నిరాశ పరిచి మూడు పరుగులకే రనౌట్ ద్వారా వెనుదిరిగాడు. ఆ  కాసేపటికే  కోహ్లీ కూడా ఔటయ్యాడు. కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా 33 బంతుల్లో 30 పరుగులు చేసి తక్కువ రన్ రేట్ నమోదు చేశాడు. మహిపాల్ లామ్రోర్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42; రజత్ పటిదార్ 21 పరుగులతో రాణించారు. చివర్లో దినేష్ కార్తీక్ మరోసారి సత్తా చాటి 17 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 26 పరుగులతో అజేయంగా నిలవడంతో బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173  పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో మహీష తీక్షణ మూడు; మొయిన్ అలీ రెండు; ప్రెటోరియస్ ఒక వికెట్ సాధించారు.

చెన్నై ఇన్నింగ్స్ ధాటిగానే ఆరంభించి తొలి వికెట్ కు 54 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 28 పరుగులు చేసి షాబాజ్ అహ్మద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. రాబిన్ ఊతప్ప(1); అంబటి రాయుడు (10) విఫలమయ్యారు, 37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసిన డెవాన్ కాన్వే నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు. మొయిన్ అలీ 34 పరుగులతో రాణించాడు. రవీంద్ర జడేజా(3); కెప్టెన్ ధోనీ(2); ప్రెటోరియస్ (13) కూడా నిరాశ పరిచారు దీనితో చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేయగలిగింది. బెంగుళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు; మాక్స్ వెల్ రెండు; షాబాజ్ అహ్మద్, హాజెల్ వుడ్, హసరంగ తలా ఒక వికెట్ పడగొట్టారు.

మూడు కీలక వికెట్లు సాధించిన హర్షల్ పటేల్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : గుజరాత్ జోరుకు పంజాబ్ బ్రేక్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్