Thursday, April 25, 2024
Homeస్పోర్ట్స్గుజరాత్ జోరుకు పంజాబ్ బ్రేక్

గుజరాత్ జోరుకు పంజాబ్ బ్రేక్

Gujarath lost: వరుస విజయాలతో దూసుకెళ్తున్న గుజరాత్ టైటాన్స్ జోరుకు పంజాబ్ కింగ్స్ బ్రేక్ వేసింది.  నేడు జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో గుజరాత్ పై పంజాబ్ ఘనవిజయం సాధించింది. రబడతో పాటు మిగిలిన బౌలర్లు కూడా సమిష్టిగా రాణించి  గుజరాత్ ను 143 పరుగులకే కట్టడి చేయగా….బ్యాటింగ్ లో శిఖర్ ధావన్, భానుక రాజపక్ష,  చివర్లో లివింగ్ స్టోన్ మెరుపు ఇన్నింగ్స్ తో  మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే పంజాబ్ విజయం సొంతం చేసుకుంది.

నవీ ముంబైలోని డా. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది, 17 పరుగులకు తొలి వికెట్ (శుభమన్ గిల్-9 రనౌట్) కోల్పోయిన గుజరాత్ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా-21; కెప్టెన్ పాండ్యా-1;  డేవిడ్ మిల్లర్-11, రాహుల్ తెవాటియా-11 పరుగులు చేసి ఔటవ్వగా రషీద్ ఖాన్ డకౌట్ అయ్యాడు. చివర్లో ప్రదీప్ సంగ్వాన్-­2; ఫెర్గ్యుసన్-5 కూడా విఫలమయ్యారు. సాయి సుదర్శన్ ఒక్కడే రాణించి 50 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్సర్లతో 65 పరుగులు సాధించి ఐపీఎల్ లో తొలి అర్ధ సెంచరీ నమోదు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో రబడ నాలుగు; రిషి ధావన్, లియామ్ లివింగ్ స్టోన్, అర్షదీప్ సింగ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

పంజాబ్ 10 పరుగుల వద్ద తొలి వికెట్ (బెయిర్ స్టో-1) కోల్పోయింది, రెండో వికెట్ కు శిఖర్ ధావన్- రాజపక్షేలు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు, 28 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్సర్ తో 40పరుగులు చేసిన రాజపక్షే ఫెర్గ్యుసన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు.  ఆ తర్వాత వచ్చిన వచ్చిన లివింగ్ స్టోన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి కేవలం 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 30; శిఖర్ ధావన్ 53 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్సర్ తో 62 తో అజేయంగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో షమీ, ఫెర్గ్యుసన్ చెరో వికెట్ సాధించారు.

నాలుగు వికెట్లు సాధించిన రబడకు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : రాజస్థాన్ పై కోల్ కతా విజయం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్