Friday, March 29, 2024
Homeసినిమాఆ డ్యాన్సులకి వంద మార్కులు వేస్తా : శేఖర్ మాస్టర్

ఆ డ్యాన్సులకి వంద మార్కులు వేస్తా : శేఖర్ మాస్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు న‌టించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప‌ర‌శురామ్ తెర‌కెక్కించిన ఈ భారీ చిత్రం కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. నిన్న విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమా అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది, అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఆల్ టైం రికార్డ్ ని సృష్టించింది. సర్కారు వారి పాట ట్రైలర్ 24గంటల్లో 27 మిలియన్స్ వ్యూస్ ని క్రాస్ చేసి టాలీవుడ్ ఫాస్టెస్ట్ వన్ డే రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.2 మిలియన్స్ కు పైగా లైక్స్ సొంతం చేసుకొని రికార్డ్ వేగంతో దూసుకుపోతుంది.

మే 12న ప్రపంచ వ్యాప్తంగా ‘సర్కారు వారి పాట’ గ్రాండ్‌ గా విడుదల కాబోతున్న నేపధ్యంలో సినిమా కోసం గ్రేట్ సిగ్నేచర్ మూమెంట్స్ ని కంపోజ్ చేసిన స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే.. కళావతి, పెన్నీ, ఇంకో మాస్ సాంగ్ కు కొరియోగ్ర‌ఫీ చేశాను. కళావతి, పెన్నీ ఇప్పటికే విజయాలు సాధించాయి. రాబోతున్న పాట కూడా ఫ్యాన్స్ కు గొప్ప ట్రీట్. ఇందులో మహేష్ బాబు గారి స్వాగ్ అండ్ మాస్ రెండూ చూస్తారు. ఆయన సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. డ్యాన్సులు వండర్ ఫుల్ గా వుంటాయి. ఫ్యాన్స్ కు బాగా నచ్చుతాయి. డ్యాన్స్ ఎంత బాగా చేశారో చూసిన తర్వాత ప్రేక్ష‌కులే చెప్తారు.


ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక పాటలో అందరూ చేయగలిగే రెండు యునిక్ స్టెప్స్ వుంటే అది సోషల్ మీడియా రీల్స్ లోకి వెళ్లి హిట్స్ అవుతున్నాయి. అలాంటి యునిక్ స్టెప్స్ పై దృష్టి పెట్టాల్సి వుంటుంది. కళావతి, పెన్నీ సాంగ్స్ పై చాలా మంది రీల్స్ చేశారు. ఇప్పుడు రాబోతున్న మాస్ సాంగ్ కూడా అదిరిపోతుంది. అందులో కూడా యునీక్ స్టెప్స్ వుంటాయి.

మహేష్ బాబు గారితో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. మనం ఓకే అన్నా .. మాస్టర్ ఇంకోసారి చేద్దామా అంటారు. ఈ సినిమాలో ఆయన మరింత అందంగా కనిపిస్తారు. డ్యాన్స్ విషయానికి వస్తే సర్కారు వారి పాటలో సరికొత్త మహేష్ బాబు గారిని చూస్తారు. మహేష్ గారి డ్యాన్సులకి వంద మార్కులు వేస్తాను’ అన్నారు.

Also Read : మహేష్ బాబు నోట జగన్ మాట 

RELATED ARTICLES

Most Popular

న్యూస్