Thursday, March 28, 2024
Homeసినిమా‘డేగ‌ల బాబ్జీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘డేగ‌ల బాబ్జీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

Babji:  తెలుగుతెరపై తొలిసారి సింగిల్ యాక్టర్‪తో చేసిన సినిమా ‘డేగల బాబ్జీ’. ఒకే ప్లేస్‪లో, ఒకే లోకేషన్‪లో, ఒక్క వ్యక్తి మాత్రమే సినిమా అంతా కనిపిస్తాడు. ఇంకా ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నా.. కూడా వాళ్ల వాయిస్ మాత్రమే వినిపిస్తుంది తప్ప మనుషులు కనిపించరు. తమిళ్‪లో నేషనల్ అవార్డ్ పొందిన ‘ఉత్త సిరుప్పు సైజు 7’  చిత్రాన్ని తెలుగులో ‘డేగల బాబ్జీ’ పేరుతో రీమేక్ చేశారు. ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్‪ను తొలిసారి హీరోగా పరిచయం చేస్తూ.. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని  మే 20 న గ్రాండ్‪గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

బండ్ల గణేష్ మాట్లాడుతూ “ఒక గదిలో ఒక సినిమాని రెండు గంటల సేపు ఒకే ఒక్క క్యారెక్టర్ చేయడం అనేది మాములు విషయం కాదు. అలాంటి కథను నా భుజాన పెట్టి నాతో చేయించాడు దర్శకుడు వెంకట్ చంద్ర. ఈ సినిమా నిజంగా నా జీవితానికి అర్థం చెప్పే సినిమా అవుతుంది. ఈ సినిమా తర్వాత నాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పెక్ట్ వస్తుంది. ఈ రెస్పెక్ట్ కోసమే నేను 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను.  సంగీత దర్శకుడు లైనస్ అద్భుతమైన మ్యూజిక్, రీ రికార్డింగ్ ఇచ్చాడు. తమిళ్‪లో పార్థీబన్ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేసి నేషనల్ అవార్డు సాధించిన ‘ఉత్త సిరుప్పు సైజు 7’ సినిమాను తెలుగులో నేను చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా చిత్రానికి సపోర్ట్ చేస్తూ ట్రైలర్, పోస్టర్‪ను విడుదల చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్‪ గారికి, హరీష్ శంకర్ ‪గారికి ధన్యవాదాలు. మే 20న వస్తున్న ఈ సినిమాని అందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను” అన్నారు.

దర్శకుడు వెంకట్ చంద్ర మాట్లాడుతూ “బండ్ల గణేష్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. సినిమా విడుదలైన తరువాత గణేష్ ఇంత బాగా నటించగలుగుతాడా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. లైనస్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకి అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను” అన్నారు.

Also Read : ‘డేగల బాబ్జీ’ లోని ‘కలలే కన్నానే’ లిరికల్ వీడియో

RELATED ARTICLES

Most Popular

న్యూస్