Friday, April 19, 2024
HomeTrending Newsవిద్య, వైద్యానికి ప్రాధాన్యం: మంత్రి రోజా

విద్య, వైద్యానికి ప్రాధాన్యం: మంత్రి రోజా

CM tour:  విద్య, వైద్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు హయాంలో విద్యార్ధుల ఫీజు రీఇంబర్స్ మెంట్ చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారని, కానీ జగన్ సిఎం అయిన తరువాత నిర్ధిష్ట కాల వ్యవధిలో చెల్లిస్తున్నారని, ఏ నెలలో ఏ పథకం అమలు చేసేదీ ముందే చెప్పి మరీ చేస్తున్నారని, గత ప్రభుత్వ బాకీలను కూడా ఈ ప్రభుత్వం తీర్చిందని రోజా గుర్తు చేశారు.

ఈ నెల 5న సిఎం జగన్ తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ వెంకటేశ్వర స్టేడియంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా జగనన్న విద్యా దీవెన పథకం ఈ  ఏడాది నాలుగో విడత నిధులను తల్లుల అకౌంట్లలో జమ చేయనున్నారు. విద్యార్ధులు, తల్లిదండ్రులతో ముచ్చటించిన అనంతరం బహిరంగ సభలో సిఎం ప్రసంగిస్తారు.  సిఎం పర్యటన ఏర్పాట్లను తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, మేయర్ శిరీష లతో కలిసి  రోజా పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సిఎం తొలిసారిగా తమ జిల్లాకు వస్తున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేస్తామని చెప్పారు.

నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం రాష్ట్రంలో మహిళలపై నేరాలు మూడు శాతం తగాయని, మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం చితశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు చూస్తే జగన్ ప్రభుత్వ పరం చేశారని, బాబు హయంలో విద్యుత్ ఛార్జీలు పెంచి, ప్రజలపై భారం మోపి కూడా డిస్కమ్ లకు 28 వేల కోట్ల రూపాయలు బాకీలు పెట్టి వెళ్ళారని రోజా విమర్శించారు.

Also Read : సిఎం టూర్ ఏర్పాట్లు పరిశీలించిన టిటిడి ఈవో 

RELATED ARTICLES

Most Popular

న్యూస్