Monday, June 8, 2026
Homeసినిమామహేష్ బాబు నోట జగన్ మాట

మహేష్ బాబు నోట జగన్ మాట

YS Jagan-Mahesh: మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది. ఈ సినిమాలో  మహేష్ బాబు పలికిన ఒక డైలాగ్ సంచలనం రేకెత్తించింది.  2019 ఎన్నికల సందర్భంలో నేటి  ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రతి బహిరంగ సభలో చెప్పిన ‘నేను విన్నాను- నేను ఉన్నాను’ అనే డైలాగ్ ఈ సినిమాలో మహేష్ బాబు చెప్పడం విశేషం.

హీరోయిన్  కళావతి (కీర్తి సురేష్) మహేష్ బాబు వద్దకు వచ్చి ‘మీరొక పదివేల డాలర్లు అప్పిస్తే  ఎగ్జామ్ ఫీజు కట్టి ఆసీస్ లో టాప్ స్కోరు చేస్తాను’ అని  చెప్పగా వెంటనే మహేష్ బాబు ‘నేను విన్నాను- నేనున్నాను’ అంటూ బదులిస్తాడు.  వెంటనే కళావతి మహేష్ బాబును గట్టిగా కౌగిలించుకుంటుంది.  ట్రైలర్ మొత్తంలో ఈ సీన్ ఇప్పుడు సంచలనంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular