Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేటి మ్యాచ్ ల్లో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగుళూరు బుల్స్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించాయి.

జైపూర్ పింక్ పాంథర్స్ – పాట్నా పైరేట్స్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 38-28  తో జైపూర్ విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 18-12 తో ఆధిక్యం సంపాదించిన జైపూర్ రెండో అర్ధభాగంలోనూ అదే హవా కొనసాగించి 20-16 తో ముందంజలో నిలిచింది. దీనితో మ్యాచ్ ముగిసే సమయానికి 10 పాయింట్లతో గెలుపొందింది.

బెంగుళూరు బుల్స్- గుజరాత్ జెయింట్స్  జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో బెంగుళూరు 46-37 తేడాతో విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 22-17  తో ముందంజలో ఉన్న బెంగుళూరు ద్వితీయార్ధంలో కూడా రాణించి 24-20తో ఆధిక్యం ప్రదర్శించింది. బెంగుళూరు కెప్టెన్ పవన్ షెరావత్  ఈ మ్యాచ్ లో కూడా తన సత్తా చాటి 19 పాయింట్లు సాధించాడు.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత బెంగుళూరు బుల్స్ (38 పాయింట్లు); పాట్నా పైరేట్స్ (34); దబాంగ్ ఢిల్లీ (32); జైపూర్ పింక్ పాంథర్స్ (28); తమిళ్ తలైవాస్ (27); యూ ముంబా(25); జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com