Tuesday, June 16, 2026
HomeసినిమాGanesh Anthem: బాలకృష్ణ 'భగవంత్ కేసరి' నుంచి 'గణేష్' సాంగ్ విడుదల

Ganesh Anthem: బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ నుంచి ‘గణేష్’ సాంగ్ విడుదల

బాలకృష్ణ, అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ డెడ్లీ కాంబినేషన్‌ లో చిత్రం ‘భగవంత్ కేసరి’ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘భగవంత్ కేసరి’ మేకర్స్ రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ‘గణేష్ సాంగ్’ ప్రోమోతో అలరించారు. ఈరోజు పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేశారు. బాలకృష్ణ , శ్రీలీల గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకుంటూ బాబాయ్ అమ్మాయిగా సందడి చేశారు.గణేష్ పాట కోసం ఎస్ఎస్  థమన్ పెప్పీ, మాస్ ట్యూన్ కంపోజ్ చేసారు. తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఆర్కెస్ట్రేషన్ ఆకట్టుకుంది. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం మాస్‌ని కట్టిపడేసింది.  కరేముల్లా, మనీషా పాండ్రంకి ఈ పాటను హై-పిచ్డ్ వోకల్స్ తో ఎనర్జిటిక్ గా అలపించారు.శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బ్రిలియంట్ గా వుంది. పోస్టర్లు, ప్రోమోలు సెట్ చేసిన అంచనాలను ఈ పాట అందుకుంది.

దర్శకుడు అనిల్ రావిపూడి పాటల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular