Monday, June 15, 2026
HomeTrending NewsVRAs: సిఎం జగన్ కు విఆర్ఏల కృతజ్ఞతలు

VRAs: సిఎం జగన్ కు విఆర్ఏల కృతజ్ఞతలు

డిఏ పెంపుదలపై సానుకూల నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడికి గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్ ను సంఘం రాష్ట్ర ప్రతినిధులు కలుసుకున్నారు.

తమకు గత ప్రభుత్వం డీఏ రద్దు చేసిందని, అప్పట్లో ఇచ్చే డీఏ రూ. 300 కూడా రద్దు చేయడంతో తమ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో వైఎస్‌ జగన్‌ తమకు న్యాయం చేశారన్న వీఆర్‌ఏల సంఘం ప్రతినిధులు హర్షం వెలిబుచ్చారు. ఈ నిర్ణయం వల్ల 23 వేల మంది వీఆర్‌ఏలకు లబ్ధి జరుగుతుందని సీఎంకి వివరించి తమ ఆనందాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్న ప్రతినిధులు

ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికపాటి బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులు జి.టి.రామాంజనేయులు, బి.వెంకట్రావు, పి.రాంబాబు, కోశాధికారి చెన్నుపల్లి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular