Monday, February 24, 2025
HomeTrending Newsపాక్ వరద బాధిత ప్రాంతాల్లో హిందువుల కష్టాలు

పాక్ వరద బాధిత ప్రాంతాల్లో హిందువుల కష్టాలు

పాకిస్తాన్ లో వరదలు, వర్షాలతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అంతర్జాతీయ సాయం అందకపోతే పునరావాస చర్యలు చేపట్టడం పాక్ ప్రభుత్వంతో అయ్యే పని కాదు. ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్లో అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మానవ హాకుల ఉల్లంఘన, బలోచిస్తాన్ లో వేర్పాటువాద ఉద్యమం, ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలో అభివృద్ధి లేమితో ప్రజల నిరసనలు ఇలా అంతర్జాతీయంగా పాక్ ప్రతిష్ట మసకబారుతోంది. ఈ దశలో సింద్ ప్రావిన్సు లో మరో దారుణం చోటుచేసుకుంది.

వర్షాలు, వరదలతో రోడ్డున పడ్డ వరద బాధితులను ఆదుకోవటంలో అధికార యంత్రాంగం వివక్ష చూపటం అంతర్జాతీయంగా విమర్శలకు దారితీస్తోంది. సింద్ రాష్ట్రంలోని మీర్పూర్ మతేలో ప్రాంతంలో వరద బాధితులకు ఏర్పాటు చేసిన క్యాంపుల నుంచి హిందూ కుటుంబాలను బయటకు వెళ్ళగొట్టారు. బఘ్రి కులానికి చెందిన హిందువులను రాత్రికి రాత్రి అధికారులు బయటకు వెళ్ళగొట్టారు. ప్రశ్నించిన వారికి అధికారులు వింత సమాధానాలు ఇచ్చారు. మీరు వరద బాధితులు కాదని సమాధానమిచ్చారు. దీంతో పిల్ల పాపలతో రోడ్డున పడ్డ హిందూ కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి.

అటు బలోచిస్తాన్ లోని కచ్చి జిల్లా జలాల్ ఖాన్ గ్రామంలో నిలువ నీడలేక ఇల్లు కోల్పోయిన హిందూ కుటుంబాలను ఓ ఆలయ పూజారి ఆడుకున్నారు. సర్వం కోల్పోయిన హిందూ కుటుంబాలు బాబా మధుదాస్ ఆలయంలో తలదాచుకున్నారు. నెల రోజులు కావస్తున్నా పాక్ అధికార యంత్రాంగం ఆ గ్రామం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఈ విధంగా హిందువుల పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని వాయిస్ అఫ్ పాకిస్తాన్ మైనారిటీస్ సంస్థ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది.

వరదబాధితులకు సాయంలో ప్రభుత్వ యంత్రాంగం తీరును ఓ జర్నలిస్టు వెలుగులోకి తీసుకొచ్చారు. చిన్నారులకు ఆరోగ్య సమస్యలు వచ్చి ఇప్పటికే కొందరు మృత్యువాత పడ్డారని స్థానిక ఫ్రీలాన్సు జర్నలిస్టు నస్రల్ల గడ్డాని వీడియో తీసి నెట్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవటంతో… చట్ట విరుద్దంగా వ్యవహరించాడని పాక్ పోలీసులు నస్రల్ల గద్దనీని అరెస్టు చేసి జైల్లో వేశారు.

Also Read : వరద సాయం పేరుతో హిందూ బాలికపై గ్యాంగ్ రేప్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్