Saturday, July 27, 2024
HomeTrending Newsపాదయాత్ర పేరుతో వసూళ్లు: జోగి రమేష్

పాదయాత్ర పేరుతో వసూళ్లు: జోగి రమేష్

భవిష్యత్తులో రాష్ట్రంలోని  ప్రజల మధ్య ఎలాంటి  వైషమ్యాలూ తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే మూడు రాజధానుల బిల్లును తమ ప్రభుత్వం తీసుకు వచ్చిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.  ఆతర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో విజయవాడ, గుంటూరు ప్రజలు స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించి అధికార వికేంద్రీకరణకు మద్దతు తెలిపారని చెప్పారు.  అమరావతిని చంద్రబాబు ఏటిఎం గా మార్చుకున్నారని, అందుకే పాదయాత్రలతో విరాళాలు సేకరిస్తూ… మరోవైపు అమెరికా లో సభలు పెట్టి మరీ అమరావతి ఉద్యమం పేరుతో వసూళ్లు చేస్తున్నారని  జోగి ఆరోపించారు.

అమరావతికోసం జరుగుతున్న యాత్ర పాదయాత్ర కాదని, తెలుగుదేశం శవ యాత్ర అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. సెలెక్ట్, ఎలెక్ట్- కలెక్ట్ కోసం జరుగుతున్న యాత్ర అన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీని బతికించడం కోసం చేపట్టినదేనన్నారు.  తాము కూడా ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగామని, కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలని మూడు రాజధానుల బిల్లును తాము సమర్ధిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు జగన్ పాలనపై సంతృప్తి గా ఉండి, సంక్షేమ పథకాలతో, విద్యా పథకాలతో పిల్లలను మంచిగా చదివించుకుంటున్నారని చెప్పారు. కానీ వీరు మాత్రం రెండు, మూడు లక్షల కోట్ల రూపాయల సంపద ఒకే ప్రాంతంలో ఖర్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న  ఈ పాదయాత్ర టూ పాయింట్ ఓ (2.O) కాదని 2.0 (టూ పాయింట్ జీరో) అని అభివర్ణించారు.

Also Read : కేఏ పాల్ ఎంతో మీరూ అంతే : బిజెపిపై జోగి ఫైర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్