Saturday, April 20, 2024
HomeTrending Newsమోడీ ప్రైవేటీకరణ..కమీషన్ల కెసిఆర్ - రాహుల్ విమర్శ

మోడీ ప్రైవేటీకరణ..కమీషన్ల కెసిఆర్ – రాహుల్ విమర్శ

ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చివరిరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉత్సాహంగా కొనసాగింది.  కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం మేనూరులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో రాహుల్ గాంధీ తనదైన శైలిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీ, కేసీఆర్ కలిసే పనిచేస్తారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

మోదీ చేసే ప్రతి చట్టానికి పార్లమెంటులో కేసీఆర్ మద్దతిస్తారని ఆరోపించారు. ఒకవైపు మోదీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తుంటే… మరోవైపు కేసీఆర్‌ ప్రాజెక్టుల ద్వారా కమీషన్లు దండుకుంటున్నారని అన్నారు. ప్రధాని మోదీ నోట్ల రద్దుతో రైతులు, ప్రజల జీవితాన్ని దెబ్బతీశారని రాహుల్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​గాంధీ తెలిపారు. ప్రతి పంటకు మద్దతు ధర అందిస్తామని పేర్కొన్నారు.

ఎదురుదెబ్బలు తగిలినా పోరాటం ఆపని ధీరోదాత్తులు తెలంగాణ ప్రజలని రాహుల్‌ గాంధి అన్నారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరలేదని రాహుల్ అన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును కెసిఆర్ దెబ్బతీశారని విమర్శించారు. 10, 12 రోజులుగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నామన్న రాహుల్ గాంధీ..  తెలంగాణను విడిచిపెట్టి వెళ్తున్నందుకు బాధగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో భారత్​ జోడో యాత్ర మొత్తం మీద 375కిలోమీటర్లు సాగింది. నిన్న రాత్రి (సోమవారం) రాత్రికి మహారాష్ట్రలోకి ప్రవేశించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్