Tuesday, April 16, 2024
HomeTrending Newsతెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది ఈ మేరకు భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ సంస్థ తెలంగాణ లో 200 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. మంత్రి కే తారకరామారావు తో ప్రగతి భవన్లో సమావేశం అయిన అనంతరం కంపెనీ యండి అండ్ సీఈవో సంజీవ్ నవంగుల్ ఈ మేరకు తెలిపారు. ఈ భారీ పెట్టుబడిని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన వాక్సిన్ మరియు ఇంజక్టబుల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు వినియోగిస్తామన్నారు. జీనోమ్ వ్యాలీ లో ఏర్పాటు చేయబోయే తమ తయారీ కేంద్రం నుంచి మహిళలకు సంబంధించిన ఆరోగ్య ఉత్పత్తులు, రేబీస్ వ్యాధి వ్యాక్సిన్లు మరియు ఇతర హార్మోన్ సంభందిత ఉత్పత్తులను తయారు చేయనున్నట్లు తెలిపారు.

భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ సంస్థ హైదరాబాద్లో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కంపెనీ యం డి సంజీవ్ నావంగుల్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఈ సంస్థ ఏర్పాటు చేయనున్న తయారీ కేంద్రం ద్వారా లైఫ్ సైన్సెస్ రంగంలో ముఖ్యంగా వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ రాజధానిగా ఉందని చెప్పేందుకు ఈరోజు భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ పెడుతున్న పెట్టుబడే నిదర్శనమన్నారు. సంస్థ వేగంగా తయారీ యూనిట్ ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తరఫున కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా భారత్ చైర్మన్ కి తెలిపారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు లైఫ్ సైన్సెస్ శాఖ డైరెక్టర్ శక్తి నాగప్పన్ లు పాల్గొన్నారు.

Also Read : రాష్ట్రంలో ముల్క్ హోల్డింగ్స్ పెట్టుబడులు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్