Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్భవీనాకు రజతం: రాష్ట్రపతి, ప్రధాని అభినందన

భవీనాకు రజతం: రాష్ట్రపతి, ప్రధాని అభినందన

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో ఇండియా క్రీడాకారిణి భవీనా పటేల్ రజత పతకం గెల్చుకొంది. ఈరోజు జరిగిన టేబుల్ టెన్నిస్ ఫైనల్ మ్యాచ్ లో మన దేశానికి భవీనాపై చైనాకు చెందిన జో యింగ్ 3-0 తేడాతో విజయం సాధించింది. మూడు వరుస సెట్లను 11-7; 11-5; 11-6  స్కోర్లతో  జో యింగ్ గెల్చుకుంది. ఈ పారాలింపిక్స్ లో ఇండియాకు తొలి పతకం లభించింది.

పారాలింపిక్స్ చరిత్రలో టేబుల్ టెన్నిస్ విభాగంలో పతకం లభించడం ఇదే మొదటిసారి. ఈ పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించిన భవీనా  పటేల్ ను భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర క్రీడల శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, సెహ్వాగ్, అనిల్ కుంబ్లే,  షూటింగ్ లో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత  అభినవ్ బింద్రా తదితరులు భవీనాకు  అభినందనలు తెలియజేశారు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భవీనాకు  అభినందనలు తెలియజేశారు. భారత క్రీడా చరిత్రలో ఇదో చారిత్రాత్మక, అత్యంత స్పూర్తిదాయక మైన రోజుగా అయన అభివర్ణించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్