Saturday, March 7, 2026
Homeసినిమాసంక్రాంతికి రావ‌డం ప‌క్కా.. అంటున్న‌ ‘భీమ్లా నాయ‌క్’

సంక్రాంతికి రావ‌డం ప‌క్కా.. అంటున్న‌ ‘భీమ్లా నాయ‌క్’

Bheemla Nayak Team Clarified On Release Date :

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, క్రేజీ స్టార్ రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ‘భీమ్లా నాయ‌క్’. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాష‌ణ‌లు అందిస్తుండ‌డం విశేషం. ఈ భారీ చిత్రాన్ని ప్ర‌ముఖ ని్ర్మాణ సంస్థ‌ సితార ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మూవీని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా గ‌తంలో ప్ర‌క‌టించారు.

అయితే.. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న‌ ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి వ‌స్తుండ‌డంతో మ‌హేష్ బాబు ‘స‌ర్కారు వారి పాట’ వాయిదా ప‌డింది. అలాగే భీమ్లా నాయ‌క్ కూడా వాయిదా ప‌డుతుంద‌ని టాలీవుడ్ లో గ‌ట్టిగా టాక్ వినిపించింది. ఇలా వార్త‌లు వ‌చ్చిన ప్ర‌తిసారీ సితార సంస్థ భీమ్లా నాయ‌క్ సంక్రాంతికి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టిస్తూనే ఉంది. ఈరోజు మ‌రోసారి భీమ్లా నాయ‌క్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న థియేట‌ర్లో రిలీజ్ కానుంద‌ని నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది. దీంతో.. ఈ సంక్రాంతికి భీమ్లా నాయ‌క్ రావ‌డం ప‌క్కా అయ్యింది. దీంతో ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

Also Read :  భీమ్లా నాయక్ వీడియో ప్రొమో అదిరింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular