Thursday, May 8, 2025
HomeTrending Newsమూడు రోజుల్లో వంతెన మాయం

మూడు రోజుల్లో వంతెన మాయం

Bihar Bridge Thieves :

బీహార్‌లో కొందరు దొంగలు ఏకంగా 60 అడుగుల ఐరన్‌ బ్రిడ్జిని మాయం చేశారు. రోహ్తాస్‌ జిల్లా అమియావార్‌లో ఓ పురాతన ఐరన్‌ బ్రిడ్జి ఉంది. ఇది 20 టన్నుల బరువుంటుంది. ఆరా కెనాల్‌పై నిర్మించిన ఈ బ్రిడ్జి పదుల సంఖ్యలో గ్రామాలను కలిపేది. శిథిలావస్థకు చేరిన కారణంగా…
ప్రస్తుతం దీన్ని ఉపయోగించడం లేదు. దీంతో కూలగొట్టాలని గ్రామస్థులు గతంలో అధికారులకు విజ్ఞప్తి చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇదే అదునుగా భావించిన ఘరానా దొంగలు బ్రిడ్జిని దర్జాగా ఎత్తుకుపోవడానికి ప్లాన్‌ వేశారు. వాడుకలో లేని ఈ వంతెనలో భారీగా ఇనుము ఉండటాన్ని చూసి దొంగలు పక్కా పథకం పన్నారు. విశేషమేమిటంటే…

ఈ దొంగలు ఇరిగేషన్‌ శాఖ అధికారులమని చెప్పడంతో ప్రజలు, స్థానిక అధికారులు కూడా వారికి సహకరించారు. ఇంకేముంది.. గ్యాస్‌ కట్టర్లతో ఇనుమును కట్‌ చేశారు. దాన్ని వాహనంలో లోడ్‌ చేసి మూడు రోజుల్లోనే బ్రిడ్జిని ఎత్తుకుపోయారు. అంతా అయిపోయాక… ఆ తరువాత, వచ్చింది ఇరిగేషన్‌ అధికారులు కాదు.. దొంగలు అని తెలిసి స్థానికులంతా కంగుతిన్నారు.

కోసమెరుపు .. ప్రశాంత్ కిషోర్ సొంత జిల్లా..రోహ్తాస్‌ జిల్లా

RELATED ARTICLES

Most Popular

న్యూస్