Thursday, June 18, 2026
Homeసినిమా'బింబిసార 2 'కి 100 కోట్ల ఆఫర్?

‘బింబిసార 2 ‘కి 100 కోట్ల ఆఫర్?

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటి ‘బింబిసార’. ఈ సినిమా ద్వారా మల్లిడి వశిష్ట్ డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర అనూహ్య విజయం సాధించింది. ఈ సినిమా రిలీజ్ కి ముందే బింబిసార 2 ఉంటుందని ప్రకటించారు. దీనిని బట్టి బింబిసార మీద ఎంత నమ్మకంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే.. బింబిసార రిలీజ్ తర్వాత డైరెక్టర్ మల్లిడి వశిస్ట్ భారీ ఆఫర్స్ వచ్చాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ కథ ఉంటే చెప్పమని ఆఫర్ ఇచ్చారని.. అలాగే చిరంజీవి, బాలకృష్ణ కూడా కథ చెప్పమని ఆఫర్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.

దాంతో మల్లిడి వశిస్ట్ బింబిసార 2 కు కథ మాత్రం అందించి దర్శకత్వ బాధ్యతలను మాత్రం రొమాంటిక్ డైరెక్టర్ అనిల్ పాడూరికి ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. వశిస్ట్ రజినీకాంత్ తో అనుకున్న ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇక చరణ్‌ కి కథ చెబుదామని వెళితే.. చిరంజీవి మంచి కథ చెప్పమని ఆఫర్ ఇచ్చారట. అలాగే ఓ పెద్ద నిర్మాణ సంస్థ బాలయ్యతో సినిమా చేయడం కోసం వశిష్ట్ కు అడ్వాన్స్ ఇచ్చిందట. ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేయడం కోసం కథ రెడీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. బింబిసార 2 కు జీ 5 సినిమా 100 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందట.

జీ 5 సినిమాకి కళ్యాణ్‌ రామ్ బింబిసార 2 ఫస్ట్ కాపీ ఇస్తే.. 100 కోట్లు ఇస్తామన్నారట. మల్లిడి వశిష్ట్ ఈ చిత్రానికి డైరెక్టర్ కాకపోయినా ఈ ఆఫర్ ఇస్తామన్నారట. అయితే.. క‌థ ఇంకా రెడీ కాలేదు. వ‌శిష్ట బింబిసార టైమ్ లోనే  బింబిసార 2 క‌థ రాసేశాడు. ఇప్పుడు ఆ క‌థ‌ని ప‌క్క‌న పెట్టి, కొత్త క‌థ రాసుకొనే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారట మేకర్స్. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆల‌స్యం అవుతోంది. ఆగ‌స్టులో ఈ సినిమా ప్రారంభించి సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకుంటున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular