Thursday, June 18, 2026
Homeసినిమా'యానిమల్' వాయిదా పడడానికి కారణం..?

‘యానిమల్’ వాయిదా పడడానికి కారణం..?

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా యాక్షన్-థ్రిల్లర్ ‘యానిమల్’ ప్రీ-టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలై ట్రెమండస్ రెస్పాన్స్ తో అంచనాలు పెంచింది. యానిమల్‌ని థియేటర్లలో చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే..ఈ  సినిమా విడుదల వాయిదా పడింది. మొదట ఆగస్ట్ 11న విడుదల కావాల్సిన యానిమల్ డిసెంబర్ 1కి వాయిదా పడింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసి వాయిదాకు గల కారణాన్ని చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అధికంగా ఉండటమే ఆలస్యానికి ప్రధాన కారణమని వివరించారు.

సినిమాలో 7 పాటలు ఉన్నాయని, ఒక్కో పాటను ఐదు భాషల్లో పర్ఫెక్ట్ లిరిక్స్‌తో రికార్డ్ చేయడం బిగ్ టాస్క్ అని చెప్పారు. ప్రీ టీజర్‌లోని సీక్వెన్స్ సినిమాలో ఉందని కూడా స్పష్టం చేశారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోని డైనమిక్ పవర్‌హౌస్‌ల కలయికలో విజనరీ భూషణ్ కుమార్ టి సిరీస్ పై భద్రకాళి పిక్చర్స్‌ పై ప్రణయ్ రెడ్డి వంగాతో కలసి ఈ యాక్షన్ సాగాను నిర్మిస్తున్నారు. రణబీర్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular