Saturday, January 18, 2025
HomeTrending Newsబిపిన్ రావత్, కళ్యాణ్ సింగ్ లకు పద్మ విభూషణ్

బిపిన్ రావత్, కళ్యాణ్ సింగ్ లకు పద్మ విభూషణ్

Padma Awards: ఆర్మీ హెలికాఫ్టర్ దుర్ఘటనలో అసువులు బాసిన చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. రావత్ తో పాటు శ్రీమతి ప్రభా ఆత్రే(మహారాష్ట్ర), శ్రీ రాధేశ్యాం ఖేమ్కా(ఉత్తర ప్రదేశ్), శ్రీ కళ్యాన్ సింగ్ లకు పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించారు.

మరో 17 మందికి పద్మ భూషణ్ ప్రకటించారు. కోవిడ్ నియంత్రణకు కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారు చేసిన  భారత్ బయోటెక్  కంపెనీ అధినేతలు కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా లకు పద్మ భూషణ్ వరించింది. కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ కు పద్మ భూషణ్ ప్రకటించారు. గూగుల్ అనుబంధ కంపెని ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రో సాఫ్ట్ సిఈవో సత్య నాదెళ్ళ లకు పద్మ భూషణ్ ఇచ్చారు.  కమ్యునిస్ట్ వృద్ధ నేత బుద్ధదేవ్ భట్టాచార్య కు కూడా పద్మభూషణ్ ప్రకటించారు.

విక్టర్  బెనర్జీ (కళలు- వెస్ట్ బెంగాల్ ); గుర్మీత్ బావా(కళలు-పంజాబ్); నటరాజన్ చంద్రశేఖరన్ (ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ-మహారాష్ట్ర); మాధుర్ జాఫ్రీ (అమెరికా); దేవేంద్ర ఝాఝారియా (క్రీడలు-రాజస్థాన్); రషీద్ ఖాన్ (కళలు-ఉత్తర ప్రదేశ్); రాజీవ్ మేహ్రిషి (సివిల్ సర్వీస్-రాజస్థాన్); సైరస్ పూణావాలా (ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ – మహారాష్ట్ర); సంజయ రాజారాం (సైన్సు అండ్ ఇంజనీరింగ్ – మెక్సికో); ప్రతిభా రాయ్ (సాహిత్యం- విద్య – ఓడిశా); స్వామి సచిదానంద్ ( సాహిత్యం, విద్య – గుజరాత్); వశిష్ట్ త్రిపాఠి (సాహిత్యం, విద్య- ఉత్తర ప్రదేశ్)

RELATED ARTICLES

Most Popular

న్యూస్