Sunday, January 19, 2025
HomeTrending Newsమహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ!

మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ!

Bird Flu In Maharashtra : మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ భయం నెలకొంది. థానే జిల్లాలోని వెహ్లోలిలో ఓ కోళ్లఫారంలో వంద కోళ్లు ఆకస్మికంగా మృతిచెందాయి. బర్డ్ ఫ్లూతోనే కోళ్లు మరణించాయనే అనుమానంతో కోళ్ల నమూనాలను పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. వైరస్‌ వ్యాప్తి మరింత చెందకుండా చర్యలు తీసుకోవాలని పశుసంవర్థకశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ రాజేష్ జె నర్వేకర్ ఆదేశించారు.

వెహ్లోలీకి కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్న సుమారు 25 వేల కోళ్లను చంపేయాలని పశు సంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే జిల్లాలో హెచ్‌5ఎన్‌1 ఏవియన్‌ ఇన్‌ఫ్లుఎంజా కారణంగా పక్షులు చనిపోయాయని థానే జెడ్పీ సీఈఓ డా. బహుసాహెబ్‌ దంగ్డే వెల్లడించారు. బర్డ్‌ ఫ్లూ కేసులను గుర్తించినట్లు కేంద్ర పశు సంవర్ధక శాఖకు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

పావురాలు, కొంగలు తదితర దూర ప్రాంతాల వరకు వెళ్ళే పక్షుల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది. ఆయా పక్షులు వైరస్ ఉన్న ప్రాంతాల్లో వాలటం వాళ్ళ వాటి రెక్కలకు, ఈకలకు వైరస్ అంటుకుని ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పావురాల ద్వారా బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని, వైరస్ వ్యాప్తికి కారణమయ్యే వీటిల్లో వ్యాధి లక్షణాలు ఏ మాత్రం ఉండవని పక్షి శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్