Monday, May 20, 2024
Homeసినిమాచెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క

చెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క

నవీన్ పోలిశెట్టి, అందాల తార అనుష్క శెట్టి హీరో, హీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. సోమవారం అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ చిత్రంలో పోషిస్తున్న అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ లుక్ లో ఆమె కిచెన్ లో డెలిషియస్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్లు ఉందీ లుక్. ఈ స్పెషల్ పోస్టర్ లో అనుష్కకు బర్త్ డే విశెస్ తెలిపారు.

వచ్చే ఏడాది తెర పైకి రానున్న ఈ మూవీపై ఫిల్మ్ లవర్స్ లో మంచి అంచనాలున్నాయి. అనుష్క కథ నచ్చితే తప్ప సినిమా చేయదు. అలాంటిది అనుష్క కథ ఓకే చేసిందంటే.. అందులో విషయం ఉంటుందనే టాక్ ఉంది. ఇప్పుడు చెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క శెట్టి ఓ డిఫరెంట్ మూవీ చేస్తుండడంతో పాజిటివ్ టాక్ ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. మరి.. చెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క మరో సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్