Saturday, November 23, 2024
HomeTrending Newsబిజెపి ‘నాడు-నేడు’

బిజెపి ‘నాడు-నేడు’

ప్రభుత్వ స్కూళ్ళు, వైద్యశాలల్లో నాడు-నేడు పేరుతో జగన్ ప్రభుత్వం మౌళిక వసతులు కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. స్కూళ్ళు, హాస్పిటల్స్ లో గతంలో ఎలాంటి వసతులు ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయనే దానిపై నాడు-నేడు పేరుతో ఫోటోలు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ కూడా మరో ‘నాడు-నేడు’కు శ్రీకారం చుట్టింది.

కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలకు తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు  ఖర్చు పెడుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతి పవార్ మచిలీపట్నంలో జరుగుతోన్న మెడికల్ కాలేజీ పనులను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులో కేవలం సిఎం జగన్ ఫోటో మాత్రమే ఉండడాన్ని గమనించిన ఆమె ప్రధాని ఫోటోకూడా పెట్టాలని ఆధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు కొత్త బోర్డును ఏర్పాటు చేశారు.

ఈ రెండుఫొటోలనూ షేర్ చేస్తూ నాడు-నేడు అంటూ  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు నేతలు పోస్ట్ చేశారు.  ఇప్పుడు ఆ ఫోటో వైరల్ గా మారింది.

Also Read: నాడు-నేడుపై నిరంతర పర్యవేక్షణ : సిఎం ఆదేశం

RELATED ARTICLES

Most Popular

న్యూస్