Monday, January 20, 2025
HomeTrending NewsBJP-AP: పొత్తుపై క్లారిటీ లేదు: సోము

BJP-AP: పొత్తుపై క్లారిటీ లేదు: సోము

ఢిల్లీలో తమ పార్టీ అగ్ర నేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ అయ్యారని, ఆ తర్వాత వారు ఏపీ పర్యటనకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేసినందున రెండు పార్టీల మధ్య పొత్తు అనే అంశం తెరపైకివచ్చిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఈ భేటీ తర్వాత బాబు గానీ, తమ అగ్ర నేతలు కానీ ఏమీ చెప్పలేదని వివరించారు. బిజెపి-టిడిపి పొత్తుపై చంద్రబాబు గానీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి గానీ ఎవరైనా చెప్పారా అంటూ సోము ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన  సంపర్క్ సే సమర్ధన్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరంలో ఆటో రిక్షా కార్మికులను కలిసి పేదల సంక్షేమంలో మోదీ ప్రభుత్వ కృషిని వీర్రాజు వివరించారు. అనంతరం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సోము మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ – ముద్రగడ మధ్య జరుగుతోన్న వివాదం ఒక కులానికి సంబంధించిన అంశం కాదని, రాజకీయ పరమైనదేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి మోడీ ఏమీ చేయలేదన్న దుష్ప్రచారం తొమ్మిదేళ్లుగా చేస్తున్నారని, కుటుంబ పార్టీల వల్లే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని, ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేబుతున్నామని సోము వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్