Tuesday, June 16, 2026
HomeTrending NewsNirudyoga March: బీజేపీ ‘‘నిరుద్యోగ మార్చ్’’ కు గ్రీన్ సిగ్నల్

Nirudyoga March: బీజేపీ ‘‘నిరుద్యోగ మార్చ్’’ కు గ్రీన్ సిగ్నల్

వరంగల్ జిల్లాలో బిజెపి తలపెట్టిన ఓరుగల్లు ‘‘నిరుద్యోగ మార్చ్’’ కు పోలీసుల అనుమతి లభించింది. ఈ నెల 15న హన్మకొండ కాకతీయ యూనివర్శిటీ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించనున్న ‘‘నిరుద్యోగ మార్చ్’’కు వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓరుగల్లు నిరుద్యోగ మార్చ్ విజయవంతం కోసం బీజేపీ నేతలు విస్త్రత సమావేశాలు నిర్వహిస్తున్నారు.

కాకతీయ యూనివర్శిటీతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల్లో నిరుద్యోగ మార్చ్ కు తరలిరావాలంటూ బీజేపీ నేతలు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. పాటలు పాడుతూ నిరుద్యోగ మార్చ్ కు అహ్వానిస్తున్న బీజేపీ కళా బ్రుందాలు ప్రధాన కూడళ్ళలో కళాజాత నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరుద్యోగ మార్చ్ పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న బీజేపీ నేతలు.. కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రణాలికా బద్దంగా ప్రచారం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular