Friday, April 19, 2024
HomeసినిమాWar 2: 'వార్ 2' కి ఆ ఇద్దరు నిజంగా నో చెప్పారా..?

War 2: ‘వార్ 2’ కి ఆ ఇద్దరు నిజంగా నో చెప్పారా..?

‘వార్ 2’ ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచిన చిత్రం. వార్ మూవీలో హృతిక్ రోషన్ నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్ గా వార్ 2 మూవీ ప్లాన్ చేశారు. అయితే.. ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్నట్టుగా ప్రకటించి అందరికీ సర్ ఫ్రైజ్ ఇచ్చారు. ఎప్పుడైతే వార్ 2లో ఎన్టీఆర్ నటిస్తున్నారని అనౌన్స్ చేశారో అప్పటి నుంచి టాలీవుడ్, బాలీవుడ్ లో ఈ సినిమా గురించి చర్చ మొదలైంది.

ఇంతకీ విషయం ఏంటంటే… వార్ 2 లో నటించడం కోసం ముందుగా ప్రభాస్ ని సంప్రదించారని… ప్రభాస్ కు మల్టీస్టారర్ చేయడం ఇష్టం లేకనో… ప్రస్తుతం బిజీగా ఉండడం వలనో నో చెప్పారని టాక్ వచ్చింది. అలాగే ప్రభాస్ నో చెప్పిన తర్వాత విజయ్ దేవరకొండను సంప్రదించారని.. అక్కడ కూడా నో అనే ఆన్సర్ రావడంతో అప్పుడు ఎన్టీఆర్ దగ్గరకు ఆ ఛాన్స్ వెళ్లిందని ప్రచారం జరుగుతుంది కానీ.. అలాంటిది ఏమీ జరగలేదని.. ప్రచారంలో ఉన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని… వార్ 2లో నటించేందుకు ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆరే అని బాలీవుడ్, టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

మరో వార్త ఏంటంటే.. ఎన్టీఆర్ క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్ ఉంటుందని అంటున్నారు. అలాగే ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కు 80 కోట్లు రెమ్యూనరేషన్ అని.. కాదు 100 కోట్లు రెమ్యూనరేషన్ అని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అవ్వడంతో వార్ 2 లో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు ఎన్టీఆర్. ఇక నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడట. వార్ 2 మూవీతో బ్లాక్ బస్టర్ సాధిస్తే.. ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో మరింత క్రేజ్ రావడం ఖాయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్