త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్ళి గెలవడానికి కమలనాథులు చేయని ప్రయత్నం లేదు. రైతు ఉద్యమాలతో జాట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బిజేపీ పునాదులు కదులుతున్నట్లు గ్రహించింది. ఇటివలి స్థానిక సంస్థల ఎన్నికల్లో సమాజ్ వాది పార్టి అనూహ్యంగా పుంజుకోవడం బిజేపీ కి మింగుడుపడడం లేదు. అగ్రవర్ణాల్లో ముఖ్యమంత్రి యోగి పట్ల వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించిన మోడీ -అమిత్ షా ద్వయం బ్రాహ్మణులను బుజ్జగించే పనిలో పడ్డారు.
మరో వైపు కులాల వారిగా రాజకీయ సమతౌల్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. రేపు జరగనున్న జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో అన్ని కులాలకు తగిన ప్రాధాన్యం ఉండేలా చాల జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రత్యేకించి రైతు ఉద్యమాలతో పార్టి ప్రతిష్ట దెబ్బ తిన్న ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా కుల సమీకరణలు పాటిస్తున్నారు.