Sunday, June 14, 2026
HomeTrending Newsసినీ నటి జయసుధతో బీజేపీ సంప్రదింపులు

సినీ నటి జయసుధతో బీజేపీ సంప్రదింపులు

మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. కాషాయ దళంలోకి రావాలని పార్టీ నాయకత్వం జయసుధను ఆహ్వానించింది. బిజెపి చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ ఈ రోజు జయసుధతో చర్చలు జరిపారు. బీజేపీలో చేరేందుకు జయసుధ సుముఖత వ్యక్తం చేశారని బిజెపి వర్గాలు చెపుతున్నాయి.

కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో ఈనెల 21న బీజేపీలో చేరాలని ఈటల రాజేందర్ ఆహ్వానించారు. జయసుధ గతంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో గెలుపొందిన జయసుధ, 2014లో జయసుధ ఓడిపోయారు. జయసుధ కొంతకాలంగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular