Saturday, January 18, 2025
HomeTrending Newsవీఆర్ఏల వ్యవహారంలో ప్రభుత్వం విఫలం - బండి మండిపాటు

వీఆర్ఏల వ్యవహారంలో ప్రభుత్వం విఫలం – బండి మండిపాటు

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఇందిరాపార్క్ వద్ద నిరసన చేస్తున్న వీఆర్ఏలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా మహిళా వీఆర్ఏలను అరెస్ట్ చేసి అర్ధరాత్రి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు హైదరాబాద్ లో మాట్లాడుతూ…. వీఆర్ఏల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

గత 79 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తుంటే కనీసం స్పందించని కేసీఆర్ ప్రభుత్వం ఆడబిడ్డలను నిర్బంధించి తన క్రూరమైన మనస్తత్వాన్ని చాటుకుందన్నారు. ఈ సమ్మె కాలంలో జరిగిన 50 మందికిపైగా వీఆర్ఏలు మరణానికి ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన వీఆర్ఏలను పిలిపించుకుని 4 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తానన్న ట్విట్టర్ టిల్లు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే కేసీఆర్ గాని, మంత్రులుగానీ ఇందిరాపార్క్ వద్దకొచ్చి సమాధానం చెప్పాల్సి ఉండేదని, అందుకు భిన్నంగా అరెస్టులు, లాఠీఛార్జీలు చేస్తూ అరాచకం స్రుష్టించడం దారుణమన్నారు.

బతుకమ్మ ఆడుతూ నిరసన తెలుపుతుంటే లాఠీచార్జ్ చేస్తూ అరెస్ట్ చేయడంపట్ల బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో పల్లె నుండి పట్నం దాకా ప్రతి చౌరస్తాలో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపిన విషయాన్ని కేసీఆర్ కుటుంబం మరిచిపోయిందా? అని ప్రశ్నించారు. ఏరుదాటేదాకా ఓడ మల్లన్న… ఏరు దాటాకా బోడ మల్లన్న అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వీఆర్ఏలు అడుగుడుతుంటే దుర్మార్గంగా వ్యవహరించడం టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు అద్దం పడుతోందన్నారు. వెంటనే వీఆర్ఏలను సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. లేనిపక్షంలో వీఆర్ఏలతో కలిసి బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనను ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు.

Also Read : మునుగోడు ఎన్నికలే తెరాసకు ఆఖరు బండి సంజయ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్