Sunday, June 14, 2026
HomeTrending Newsఅడవిలో ఆగిన రైలు..పోలీసు తనిఖీలు.. మహిళకు గుండెపోటు

అడవిలో ఆగిన రైలు..పోలీసు తనిఖీలు.. మహిళకు గుండెపోటు

అటవీ మధ్యలో ఓ రైలు ఆగింది. పోలీసులు హడావుడిగా తనిఖీలు చేస్తున్నారు. అది చూసిన ఓ మహిళ ఆందోళనకు గురయ్యారు.
అడవి(Forest) ప్రాంతంలో రైలు ఆగింది. ఎవరూ లేని ప్రదేశం. కిటికిలో నుంచి చూస్తే.. చీకటి. వెంటనే పోలీసులు వచ్చారు. అడవి మధ్యలో పోలీసులు రావడం ఏంటి.. తనిఖీలు చేయడమేంటని.. ఓ మహిళ ఆందోళనకు గురైంది. గుండెపోటు వచ్చింది. ఈ ఘటన నిజామాబాద్(Nizamabad) జిల్లాలో జరిగింది.
నర్సాపూర్-నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్(narasapur nagarsol express) రైలులో సంధ్య అనే మహిళ ప్రయాణిస్తోంది. సికింద్రాబాద్ కు చెందిన ఆమె షిరిడీ వెళ్లి.. తిరిగి వస్తోంది. నల్లబెల్లం అక్రమ రవాణా చేస్తున్నారని ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం వచ్చింది. అదే రైలులో సంధ్య ప్రయాణిస్తోంది. పోలీసులు తనిఖీలు చేశారు.

అయితే ఈ విషయం తెలిసి అక్రమ రవాణా చేసే వారు.. అడవి మధ్యలో చెయిన్ లాగి రైలును ధర్మాబాద్-బాసర అటవీ ప్రాంతంలో ఆపారు. మరోవైపు పోలీసులు(Police) తనిఖీలు చేస్తున్నారు. ఈ ఘటనలతో సంధ్య ఆందోళనకు గురైంది. ఆమెకు ఛాతిలో నొప్పి మెుదలైంది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది.. నిజామాబాద్ రైల్వే(Railway) అధికారులకు సమాచారం ఇచ్చారు.

నిజామాబాద్ రాగానే.. సంధ్యను అప్పటికే ఏర్పాటు చేసిన అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్(Nizamabad) జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆందోళనకు గురై అలా జరిగినట్టుగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సంధ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. చికిత్స అనంతరం ఆమెను.. డిశ్ఛార్జి చేశారు. సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని డాక్టర్లు తెలిపారు.

తనిఖీల్లో 20 బ్యాగుల నిషేధిత నల్ల బెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది పరారీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన చూసే.. సంధ్య షాక్ కు గురయ్యారు. నిజామాబాద్ మీదుగా వెళ్లే రైళ్లలో నల్లబెల్లాన్ని తరలిస్తున్నారని పక్కా సమాచారంతో పోలీసులు వెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular