Saturday, March 2, 2024
HomeTrending Newsడొంక తిరుగుడు ఎందుకు?: అంబటి ప్రశ్న

డొంక తిరుగుడు ఎందుకు?: అంబటి ప్రశ్న

పవన్ కళ్యాణ్ తన ప్రచార రథం పేరు మార్చుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సూచించారు. వారాహి అనేది అమ్మవారి రూపమని, దశావతారాలలో అది ఒక అవతారమని, అలాంటి పేరుపెట్టుకున్న వాహనం మీద పవన్‌ కల్యాణ్‌ ఎక్కి అపవిత్రమైన మాటలు మాట్లాడడం ధర్మం కాదని హితవు పలికారు. దానికి వరాహం అని పేరు పెట్టుకుని, దానిపై తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి నేడు సత్తెనపల్లిలో పవన్ కళ్యాన్ చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు.

అంబటి ప్రెస్ మీట్ విశేషాలు అయన మాటల్లోనే…

 • సత్తెనపల్లిలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టి, మా పార్టీపైనా, నాపైనా విమర్శలు చేశారు.
 • ఆయన బీజేపీకి సూటిగా ఒక సందేశం పంపినట్లుగా అర్ధం అయింది.
 • చల్లకొచ్చి ముంత దాచినట్లుగా.. తాను అక్కడికి వెళ్లి తాను చంద్రబాబుతోనే కలిసి ఉంటానని, బిజెపి కలిసి వచ్చినా, రాకపోయినా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునే గాడిదలా మోస్తానని చెప్పారు.
 • మీరుకూడా చంద్రబాబును గాడిదలా మోయండి అని కేడర్ కు చెప్పారు.
 • నా వ్యూహాన్ని నాకు వదిలేయండి అన్న మాటను బీజేపీకి పంపించారు.
 • పవన్‌ చంద్రబాబుతోనే కలిసి పోటీ చేస్తాడని.. పాతికో పరకో సీట్లు తీసుకుంటాడని. చాలాసార్లు చెప్పాం.
 • దీన్ని బీజేపీ నాయకులు, జనసేన కార్యకర్తలు కూడా తెలుసుకోవాలి.
 • మా నాయకుడు సీఎం అవుతారని వారు అనుకుంటున్నారు. ఈ వ్యూహం ఏమిటో వారు తెలుసుకోవాలి
 • ఓట్లు చీలనివ్వను. జగన్‌గారు మళ్లీ సీఎం అయ్యే ప్రసక్తి లేదు. మేమంతా కలుస్తాం. ఇవన్నీ ఎందుకు చెప్పడం?
 • చంద్రబాబుగారి దగ్గర ప్యాకేజీ తీసుకుని, ఆయన్ను మోస్తాను. ఆయనను ముఖ్యమంత్రిని చేయడం కోసం సర్వశక్తులు ఒడ్డుతాను.. అని ధైర్యంగా చెప్పొచ్చు కదా? ఈ డొంక తిరుగుడు మాటలు ఎందుకు?
 • ఏ కులాలైతే అధికారం రాలేదో..వారికి అధికారం ఇచ్చేలా నీవు పొత్తులకు వెళ్తావా? లేక చంద్రబాబును సీఎం చేయడానికి పొత్తులకు వెళ్తావా?
 • అయితే మీరు ఎంత మంది కలిసినా.. చంద్రబాబును సీఎం చేయలేరు. ఇది వాస్తవం. అందుకే పవన్‌ మాటలను ప్రజలు అర్ధం చేసుకోవాలి.
 • ఇంకా సత్తెనపల్లికి వచ్చి, అనేక మాటలు మాట్లాడావు. సత్తెనపల్లి అంటే సత్యమ్మ తల్లి వంటిది.
 • అక్కడ మాట్లాడిన ప్రతి మాటకు విలువ ఉంటుంది. ప్రతిదీ అందరూ గుర్తు పెట్టుకుంటారు.
 • కాబట్టి అందుకు భిన్నంగా వ్యవహరిస్తే దెబ్బ తింటావు.
 • ఇంకా నా మీద వ్యక్తిగత విమర్శలు. అందుకే సత్తెనపల్లి ఎంచుకున్నాడేమో? నిజానికి సెంటర్‌ గుంటూరు.
 • నేను కమిషన్లు తీసుకుంటున్నానని, నేను శవాల మీద పేలాలు ఏరుకుంటానని, పోలవరం పనుల్లో అవినీతి చేస్తున్నానని.. ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడావు.
 • ఎవరో రాసిచ్చిన మాటలన్నీ మాట్లాడావు. నేను ఒకటే చెబుతున్నాను. నీ కన్నా, చంద్రబాబు కన్నా బాగా పని చేస్తున్నాను. ఎక్కడా అవినీతికి పాల్పడడం లేదు.
 • ఇంకా నేను కాపుల గుండెల్లో కుంపటి పెడుతున్నానా? ఎప్పుడు ఆ పని చేశాను?
 • గతంలో మద్రగడ పద్మనాభంను, ఆయన కుటుంబాన్ని నీ పార్టనర్‌ చంద్రబాబు వేధించినప్పుడు, వారికి అండగా నిలబడింది నేను.
 • కానీ నీవు ఇవాళ చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని, కాపులను సర్వనాశనం చేయాలని నీవు ప్రయత్నిస్తున్నావు.
 • అందుకే నీవే కాపులకు ఒక శని. ఇది వాస్తవం.
 • నేను శవాలపై పేలాలు ఏరుకుంటానా? నీకేమైనా బుద్ది ఉందా?
 • ఎవరు ఏది చెబితే అదే మాట్లాడతావా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్ధం అవుతుందా?.
 • పవన్‌ కళ్యాణ్‌.. నీవు చేసిన ప్రతి విమర్శకు నేను సమాధానం చెప్పాను.
 • ఇప్పుడు నీవు నాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడే చెబుతావో. లేక హైదరాబాద్‌కు పోయి చెబుతావో. నీ ఇష్టం.
 • వచ్చే ఎన్నికల్లో నీవు పాతికో, పరకో ప్యాకేజీ తీసుకుని, చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తావో, లేక బీజేపీతో వస్తావో, లేక ఒంటరిగా వస్తావో తేల్చుకో. నీ ఇష్టం.
 • నీవు ఎక్కి ఊరేగు. గాడిద మాదిరిగా చంద్రబాబును ఎత్తుకుని ఊరేగుతావో నీ ఇష్టం.
 • అంతే తప్ప, కాపులను అవమానపర్చొద్దు. నీ స్వార్థం కోసం వారిని బలి చేయొద్దు.

Also Read : బాధితులకు మంత్రి అంబటి, ఎమ్మెల్యేల పరామర్శ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్