Saturday, June 13, 2026
Homeసినిమాబాబీ మెగా హీరోతో మూవీ చేయడం లేదా?

బాబీ మెగా హీరోతో మూవీ చేయడం లేదా?

మెగాస్టార్ చిరంజీవి.. వాల్తేరు వీరయ్య సినిమాతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు.  చిరంజీవికి వీరాభిమాని అయిన డైరెక్టర్ బాబీకి ఆయన్ను ఎలా చూపించాలో.. అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో.. బాగా తెలుసు కాబట్టి పూర్తి స్థాయిలో పక్కా మాస్ మూవీగా  దీన్ని తెరకెక్కించారు. చిరుకు అవసరమైన సక్సెస్ అందించారు.

అయితే.. వాల్తేరు వీరయ్య తర్వాత డైరెక్టర్ బాబీ నెక్ట్స్ మూవీని కూడా మెగా హీరోతోనే చేస్తారని టాక్ వచ్చింది. సాయిధరమ్ తేజ్ కానీ.. వరుణ్ తేజ్ తో కానీ ఉంటుందని వార్తలొచ్చాయి. మరి.. ఈ ఇద్దరికీ కథలు చెబితే నచ్చలేదో..? కథలు చెప్పలేదో కానీ.. బాబీ నెక్ట్స్ మూవీ మెగా హీరోతో కాదని.. ఎనర్జిటిక్ హీరో రామ్ తో అని తెలిసింది. సక్సెస్ కొనసాగించాలంటే.. రామ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ అయితే తప్ప తన కథకి న్యాయం చేయలేరని బాబీ ఫిక్స్ అయ్యాడట.

బాబి, రామ్ కి ఇటీవలే ఓ మాస్ కథ చెప్పి ఒప్పించారట. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం రామ్ – ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. దీని పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ దక్కించుకుంటానన్న  కాన్పిడెన్స్ రామ్ లో కనిపిస్తుంది. మరి.. అంతా సెట్ అయితే.. రామ్ ని బాబీ కొత్తగా ఎలా చూపిస్తాడో అనేది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular