Saturday, January 18, 2025
Homeసినిమాప్రభాస్ ను ఢీ కొట్టనున్న బాలీవుడ్ స్టార్

ప్రభాస్ ను ఢీ కొట్టనున్న బాలీవుడ్ స్టార్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ – పూజా హేగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ముఖ్యపాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ భారీ పిరియాడిక్ మూవీగా రూపొందుతోన్న ఈ క్రేజీ మూవీని జులై 30న రిలీజ్ చేయడానికి అంతా ప్లాన్ చేశారు. అయితే.. కరోనా కారణంగా అనుకున్న డేట్ కి రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రావడం కుదరడం లేదు. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయితే.. అప్పుడు షూటింగ్ మొదలుపెట్టడానికి టీమ్ రెడీగా ఉన్నట్టు సమాచారం.

ఇక ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ సలార్. దీనికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో ప్ర‌భాస్ డ్యూయెల్ రోల్‌లో న‌టిస్తున్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ సలార్ ను వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే..  ఎంతో క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఈ భారీ చిత్రంలో ప్ర‌భాస్‌ను ఢీ కొట్టే ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్ పాత్ర‌లో ఎవరు నటించనున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు ఈ మూవీ మేకర్స్ విలన్ ఎవరు అనేది ప్రకటించలేదు.

తాజా వార్త ఏంటంటే.. సలార్ లో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్‌ను న‌టింప చేయ‌బోతున్నారంటూ బాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంతకీ సలార్ లో విల‌న్‌గా న‌టించే విల‌న్ ఎవ‌రంటే..  జాన్ అబ్ర‌హం పేరు వినిపిస్తోంది. పాన్ ఇండియా మూవీ కావ‌డం.. అది కూడా బాహుబలి చిత్రంతో చరిత్ర సృష్టించిన ప్రభాస్ మూవీ కావడంతో స‌లార్‌లో న‌టించ‌డానికి జాన్ అబ్ర‌హం ఓకే చెప్పాడంటూ న్యూస్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే… ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్