Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్థామస్ అండ్ ఉబెర్ క్వార్టర్స్ లో ఇండియా

థామస్ అండ్ ఉబెర్ క్వార్టర్స్ లో ఇండియా

Thomas-Uber Cup: బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బ్యాంకాక్ లో జరుగుతోన్న టోటల్ ఇంజనీర్స్ థామస్ అండ్ ఊబెర్ కప్ ఫైనల్స్ 2022 టోర్నీలో ఇండియా పురుషులు, మహిళల జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాయి. థామస్ కప్ (పురుషులు) గ్రూప్ సి లో జర్మనీ తో జరిగిన ఐదు మ్యాచ్ లనూ ఇండియా 5-0తో గెల్చుకోగా, ఊబెర్ కప్ లో కెనడాతో జరిగిన మ్యాచ్ లలో ­4-1తేడాతో ముందంజలో నిలిచింది.

థామస్ కప్

సింగిల్స్ విభాగంలో

  • లక్ష్య సేన్ 21-16; 21-13తో
  • కిడంబి శ్రీకాంత్ 18-21; 21-9; 21-11 తో
  • హెచ్ ఎస్ ప్రన్నోయ్ 21-9;21-9 తో

డబుల్స్ విభాగంలో…

  • సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి ద్వయం 21-15; 10-21; 21-13తో
  • ఎమ్మార్ అర్జున్, ధృవ్ కపిల జోడీ 25-23; 21-15 తో జర్మన్ ఆటగాళ్ళపై విజయం సాధించారు.

ఊబెర్ కప్

సింగిల్స్ విభాగంలో

  • పివి సింధు 21-17; 21-10తో
  • ఆకర్షి కాశ్యప్ 17-21; 21-18; 21-17 తో
  • అస్మిత చలీహా ­12-21; 21-11; 22-20 తో

డబుల్స్ విభాగంలో…

  • తానీషా క్రాస్టో-తెరెసా జాలీ జోడీ 21-9; 21-15తో
  • ఎమ్మార్ అర్జున్, ధృవ్ కపిల జోడీ 25-23; 21-15 తో కెనడా క్రీడాకారిణులపై విజయం సాధించారు.
  • స్మృతి మిశ్రా- సిమ్రాన్ సింఘి జోడీ మాత్రం 21-19; 21-12తో ఓటమి పాలయ్యారు,

పురుషుల విభాగంలో రేపు ఇండియా కెనడాతో….. మహిళల జట్టు 10వ తేదీన అమెరికాతో తలపడనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్