Sunday, January 19, 2025
HomeసినిమాAkhanda 2: 'అఖండ 2 పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి..

Akhanda 2: ‘అఖండ 2 పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి..

బాలకృష్ణ కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను హ్యాట్రిక్ హిట్స్ తీశారు. ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ఈ తరం దర్శకులలో బాలయ్యను బోయపాటి చూపించినట్టు… మరో దర్శకుడు చూపించలేదంటే అతిశయోక్తి కాదు. అందుకని, వీళ్ళ కాంబినేషన్‌లో మరో సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు బోయపాటి శ్రీను కిక్‌ ఇచ్చే మాట చెప్పారు.ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా బోయపాటి మరోసారి అఖండ సీక్వెల్ గురించి మాట్లాడారు.

రామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా చిత్రం ‘స్కంద‌’. శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. స్కంద సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. నిన్న శనివారం సాయంత్రం స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ ఈవెంట్ లో అభిమానులంతా ‘అఖండ 2’ సినిమా గురించి అడగడంతో బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అఖండ 2 కచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. కొద్దిగా లేట్ అయినా అఖండ 2 సినిమా ఉంటుంది అని అన్నారు. దీంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. మరి స్కంద సినిమా రిలీజ్ తర్వాతే బోయపాటి అఖండ 2 మొదలుపెడతారా? లేక అల్లు అర్జున్ తో ఉన్న సినిమా తర్వాత తీస్తారా చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్