Saturday, March 7, 2026
Homeసినిమాసూర్య హీరోగా బోయపాటి సినిమా!

సూర్య హీరోగా బోయపాటి సినిమా!

బోయపాటికి ‘అఖండ’ తరువాత హిట్ పడలేదు. ఆ సినిమా తరువాత ఆయన చేసిన ‘స్కంద’ రామ్ అభిమానులను నిరాశ పరిచింది. రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. భారీ యాక్షన్ సన్నివేశాలే ఈ సినిమాకి మైనస్ అయ్యాయనే  అభిప్రాయాలు వినిపించాయి. ఆ తరువాత సినిమాను బోయపాటి ఏ హీరోతో చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

నిజానికి బోయపాటి తన తదుపరి సినిమాను బాలకృష్ణతోగానీ .. బన్నీతో గాని చేయవలసి ఉంది. బాలకృష్ణతో ‘అఖండ’ సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఇక బన్నీతో ‘సరైనోడు’ లాంటి సినిమాను బోయపాటి ఎప్పుడు చేస్తాడా అని బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఇద్దరి హీరోలలో ఒకరితో బోయపాటి ముందుకు వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు.

అయితే తాజాగా ఇప్పుడు సూర్య పేరు తెరపైకి వచ్చింది. సూర్యతో గీతా ఆర్ట్స్ వారు ఒక పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేశారు. భారీ బడ్జెట్ తో నిర్మితమయ్యే ఈ సినిమాకి దర్శకుడిగా బోయపాటి పేరే వినిపిస్తోంది. ప్రస్తుతం సూర్య ‘కంగువా’ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తరువాత కూడా ఆయన ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులనే లైన్లో పెడుతూ వెళుతున్నాడు. అందువలన బోయపాటి తదుపరి సినిమా, సూర్యతో ఉండే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular