Sunday, November 3, 2024
HomeTrending Newsఎక్స్ మాధ్యమంపై బ్రెజిల్ నిషేధం

ఎక్స్ మాధ్యమంపై బ్రెజిల్ నిషేధం

సోషల్ మీడియా వేదిక ఎక్స్ మాధ్యమంపై బ్రెజిల్ కోరడా ఝుళిపించింది. తప్పుడు వార్తల ప్రచారానికి వేదికగా మారిందని ఆ దేశ సర్వోన్నత న్యాయ స్థానం మండిపడింది. సుప్రీంకోర్టు విధించిన డెడ్‌లైన్ లోపు.. బ్రెజిల్ దేశానికి లీగ‌ల్ ప్ర‌తినిధిని ఎక్స్ నియ‌మించ‌లేదు. దీంతో ఆ మీడియాపై సుప్రీం జ‌డ్జి నిషేధం విధించారు.

కోర్టు ఆదేశాల‌కు అనుగుణంగా చ‌ర్యలు తీసుకునే వ‌ర‌కు ఎక్స్‌ను  నిషేదిస్తున్నట్టు…. తక్షణమే బ్యాన్ మలులోకి వస్తుందని జ‌డ్జి అలెగ్జాండ్రే డీ మోరేస్ తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న జ‌రిమానాల‌ను ఎక్స్ చెల్లించాల‌ని ఆదేశాల్లో పేర్కొన్నారు. త‌ప్పుడు స‌మాచారం చేర వేస్తున్న ఎక్స్ అకౌంట్ల‌ను స‌స్పెండ్ చేయాల‌ని ఏప్రిల్‌లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

కోర్టు తీసుకున్న నిర్ణ‌యంపై ఎక్స్ ఓన‌ర్ ఎల‌న్ మ‌స్క్ స్పందించారు. ప్ర‌జాస్వామ్యానికి ఫ్రీ స్పీచ్ కీల‌క‌మ‌ని, రాజ‌కీయాల కోసం ఆ వాక్ స్వేచ్ఛ‌ను నాశ‌నం చేస్తున్న‌ట్లు మ‌స్క్ ఆరోపించారు. ఎక్స్ మాధ్యమంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూడో ప్రపంచ దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలకు ఎక్స్ వేదికగా మారిందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆరోపించాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్