తెలంగాణ భవన్ లో ఈనెల 10వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన.. బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటి పార్టీ సహా, రాష్ట్ర కార్యవర్గ.. సంయుక్త సమావేశం జరుగనున్నది.
ఈ విస్తృతస్థాయి సమావేశంలో .. పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ, శాసనమండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు , జిల్లా పరిషత్ చైర్మన్ లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ లు, డిసిఎమ్ఎస్, డి.సి.సి.బి చైర్మన్ లు పాల్గొంటారు.
ఇది ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో … ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు.. పార్టీ కార్యకలాపాలు.. తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ఆహ్వానితులు ప్రతీఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని అధినేత సిఎం కేసిఆర్ తెలిపారు.