Sunday, January 19, 2025
HomeTrending Newsబాబుని తిడితే ఖబడ్దార్: బుద్దా వార్నింగ్

బాబుని తిడితే ఖబడ్దార్: బుద్దా వార్నింగ్

suicide warning:  తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై పిచ్చి పిచ్చిగా మాట్లాడే వారిని ఎదుర్కొనేందుకు వందమందితో ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఇకపై చంద్రబాబును అనవసరంగా తిట్టినా, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

అధికార పార్టీ నేతలు అనవసరంగా నోరు పారేసుకుంటే చంపడానికైనా, చావడానికైనా సిద్ధమంటూ సవాల్ చేశారు.  చంద్రబాబును టచ్ చేయాలని చూస్తే చచ్చినట్లేనని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.  చంద్రబాబు జోలికి ఎవరైనా రావాలనుకుంటే తామందరినీ దాటుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నారు.  చంద్రబాబును ఎంత తిడితే తమకు అంత పెద్ద పదవులు వస్తాయని కొంతమంది వైసీపీ నేతలు భావిస్తున్నారని,  అందుకే తాము రేయింబవళ్ళు షిఫ్టుల ప్రకారం పనిచేసేలా సూసైడ్ టీమ్ ఏర్పపాటు చేశామని ప్రకటించారు.

Also Read : మహానాడు వరకూ ‘బాడుడే బాదుడు’: చంద్రబాబు

RELATED ARTICLES

Most Popular

న్యూస్