Sunday, January 19, 2025
HomeTrending Newsవిశాఖకు రండి : బుగ్గన ఆహ్వానం

విశాఖకు రండి : బుగ్గన ఆహ్వానం

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఢిల్లీలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. మంగళవారం ప్రిమల్ పరిశ్రమ ఛైర్మన్ అజయ్ ప్రిమల్ ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కలిశారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖ వేదికగా జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన ఆహ్వానం పలికారు. అనంతరం గోద్రేజ్ ఆగ్రోవెట్ ఛైర్మన్ నదిర్  గోద్రేజ్ ను కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే పెట్టుబడిదారుల సదస్సుకు రావాలని కోరారు. హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందూజా తో సమావేశమయ్యారు. ఆయనను కూడా విశాఖ సదస్సుకు రావాలని ఆహ్వానించారు.

రాష్ట్రంలో సహజ వనరులు, పెట్టుబడులకు అవకాశాలు ఉన్న రంగాలపై మంత్రి బుగ్గన చర్చించారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కే.సునీత హాజరయ్యారు.

Also Read : విశాఖ విశ్వనగరం: బుగ్గన

RELATED ARTICLES

Most Popular

న్యూస్